Thursday, May 7, 2009

పోస్టుమాన్ సాఫ్ట్ వేర్లో ... ప్రీ-సార్టింగ్ ఆప్షన్ ...

ప్రాజెక్ట్ ఆరో పోస్ట్ మాస్టర్ లకు నమస్కారాలు,

ఈ ఉత్తరము ద్వారా మీ కు పోస్ట్ మెన్ సాఫ్ట్ వేర్ లో ని ప్రి సార్టింగ్ అఫ్ ఆర్టికల్స్ అనే ఒక అద్భుతమైన ఆప్షన్ ను పరిచయం చేస్తున్నాము. దిని ద్వారా మన ఆఫీస్ ద్వారా డెలివరి కి వచ్చిన రిజిస్టరు ఆర్టికల్స్ ను త్వరగా మరియు ఖచ్చితముగా సంబంధిత పోస్టుమాన్ బీట్ లో సులభం గా ఎంటర్ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆర్.ఎల్ గాని, ఎం.ఓ గాని, పార్సెల్ గాని ఎంటర్ చేసినట్లయితే అవి పోస్టుమాన్ డెలివరీ స్లిప్ లోకి ఆ పోస్టుమాన్ తన బీట్ లో డెలివరీ చేయు వరుసక్రమంలోనే దానిపిస్తాయి. దీనివల్ల ఆర్టికల్స్ పోస్టుమాన్ కు ఇచ్చిన తరువాత మరలా వాటిని పోస్టుమాన్ సార్ట్ చేసుకోనవలసిన అవసరం లేదు. అంతేకాక అటు డెలివరీ క్లార్క్ కు ఇటు పోస్టుమాన్ కు చాలా సమయం మిగులుతుంది.
ముఖ్యంగా పోస్టుమాన్ సాఫ్ట్ వేర్ లో ప్రతి బీట్ లో పోస్టుమాన్ డెలివరీ చేయు వరుస క్రమంలో అధ్రసీ దారుని వివరాలను "లోకాలిటీస్" అనే ఆప్షన్ క్రింద ఫీడు చేయాలి. ఇది సూపర్వైజర్ అప్షన్లలో వుంది. దీనిని ఈ క్రింది విధంగా చేయవచ్చు.

మొదట సూపర్వైజర్ గా లాగిన్ కావలెను.
తరువాత లోకాలిటీస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొనవలెను.
ఇది మై ఆఫీస్ మేను క్రింద ఉంటుంది.
లోకాలిటీస్ క్రింద హౌస్ నంబర్ల లిస్టును, అపార్ట్ మెంట్ల లిస్టు ను, స్కూళ్ళు మరియు కాలేజీస్ ల లిస్టును డెలివరీ క్రమంలో ఫీడు చేయాలి.
ఎంటర్ చేయునపుడు ముందుగా బీట్ నంబర్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత డెలివరీ క్రమంలో లోకాలిటీల లిస్టును ఎంటర్ చేయాలి.

ఈ విధంగా ప్రతి బీట్ లో ఉండే అద్ద్రస్సుదారుల వివరాలను ఎంటర్ చేయవలెను.
ఈ డేటాబేస్ ను అఫిసుకు కు వచ్చిన ఆర్టికల్స్ ను సులభంగా పోస్టుమాన్ క్రమంలో డెలివరీ స్లిప్ లో వేయడానికి ఉపయోగించుకోవచ్చు.

పైన ఎంటర్ చేసిన డేటాను ఈ క్రింది విధంగా పోస్టల్ అసిస్టెంట్ వుపయోగించుకోవచ్చు.

తాను ఆర్టికల్స్ ను ఈ క్రింది పాత్ ద్వారా సులభం గా పోస్టుమాన్ ల డెలివరీ స్లిప్ లో వేయవచ్చు.

" INVOICING --> REGISTER ARTICLES --> ARTICLES FOR DELIVERY --> PRE-SORTING --> RECEIPTS"

ముందుగా ఆర్టికల్ కు చెందిన లోకాలిటిని సెలెక్ట్ చేసినచో బీట్ నంబర్ ఆటోమాటిక్ గా వస్తుంది. తరువాత ఆర్.ఎల్. నంబరును ఎంటర్ చేయాలి. తరువాత బుకింగ్ ఆఫీసు పేరును సెలెక్ట్ చేసుకోవాలి. బుకింగ్ ఆఫీసు ల లిస్టు ను సూపర్వైజర్ మాస్టర్ మెనూలో "CITIES & DELIVERY POs" ఆప్షన్ లో ముందుగానే క్రియేట్ చేసి ఉంటే బుకింగ్ ఆఫీసు సెలక్షన్ కాడా చాలా సులభం అవుతుంది. తరువాత అడ్రసీ పేరును టైపు చేయాలి. చివరకు "OK" బటన్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ చేసిన వివరాలు సేవ్ అవుతాయి.
ఈ రకంగా ప్రీ-సార్టింగ్ ద్వారా చాలా లాభాన్ని పొందవచ్చు.
మరిచిపోరుకదు.....ఈ సదుపాయాన్ని వినియోగించుకొని వర్క్ లోడ్ ను కొంచెం తగ్గించుకొందాం...........సహకరిస్తారు కదూ.....